Wednesday, April 15, 2026
Homeశివ సూర్య డైలీభారత్‌తో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్థాన్ ప్రధాని.. కనికరించండి ప్లీజ్

భారత్‌తో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్థాన్ ప్రధాని.. కనికరించండి ప్లీజ్

పాకిస్థాన్ ప్రభుత్వం భారత్‌తో కాళ్ల బేరానికి వచ్చింది. ఉగ్రవాదుల దాడి ఎఫెక్ట్ తర్వాత భారత్ సింధు జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేసింది. ఈ తర్వాత ఇరు దేశాలు కూడా చిన్నపాటి యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధంలో పాకిస్థాన్ పాక్షికంగా దెబ్బతింది. మొత్తానికి ఇరు దేశాలు కాల్పుల విరమణకు రావడంతో ప్రస్తుతం సమస్య సద్దుమణిగింది. అయితే పాకిస్థాన్‌కు మాత్రం సింధు జలాలను భారత్ విడుదల చేయలేదు. తాజాగా దీనికి పాక్ భారత ప్రభుత్వానికి లేఖ రాసింది.
తీవ్ర నీటి ఎద్దడితో అల్లాడుతున్నామంటూ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది. సింధూ జలాల ఒప్పందం రద్దుపై పునఃసమీక్షించాలని కోరింది. పాకిస్తాన్ ఎదుర్కొంటున్న నీటి సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. కరువు పరిస్థితులు నెలకొనడంతో వ్యవసాయం, తాగునీటి అవసరాలు తీర్చడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందంపై పాక్ పునరాలోచనలో పడింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ తన నదీ జలాలను పాక్‌కు పంచుకోవాల్సి ఉంది. అయితే, ఇటీవల కాలంలో భారత్ చేపడుతున్న ప్రాజెక్టుల వల్ల తమకు నీరు అందడం లేదని పాక్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఒప్పందం రద్దు ప్రతిపాదన ప్రాంతీయంగా కలకలం రేపుతోంది. ఒకవైపు నీటి కోసం తల్లడిల్లుతున్న పాక్‌కు ఇది తప్పనిసరి చర్యగా కనిపిస్తోంది. మరోవైపు, ఈ ఒప్పందం రద్దయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారే ప్రమాదం ఉంది. ఇప్పటికే సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, జల వివాదం కొత్త చిచ్చు పెట్టే అవకాశం లేకపోలేదు.
సింధూ జలాల ఒప్పందం ఆరు దశాబ్దాల క్రితం కుదిరింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య జల పంపకాలకు ఒక చట్టాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కాలక్రమంలో వచ్చిన మార్పులు, పెరుగుతున్న నీటి అవసరాల దృష్ట్యా ఈ ఒప్పందంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ లేఖతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భారత్ ఈ లేఖకు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఒకవేళ పునఃసమీక్షకు అంగీకరిస్తే, ఇరు దేశాల మధ్య చర్చలు జరగాల్సి ఉంటుంది. ఈ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాలి. అయితే, ఈ పరిణామం మాత్రం జలవనరుల పంపకాల విషయంలో ప్రాంతీయంగా ఒక కొత్త సవాలును విసురుతోంది అనడంలో సందేహం లేదు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?