భారతీయ విద్యార్ధులకు అమెరికా మరో షాక్ ? ఇక అలా చేసినా వీసా రద్దు..!
అమెరికాలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులతో పాటు విదేశీ విద్యార్దులపై ఉరుముతున్న డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం ప్రకటించారు. ఇప్పటికే చిన్నా చితకా కారణాలతో విదేశీ విద్యార్ధుల వీసాలు రద్దు చేసి వారి స్వదేశాలకు పంపేస్తున్న ట్రంప్ సర్కార్.. ఇప్పుడు వారికి మరో షాకిచ్చింది. ఇకపై ఇలా చేస్తే కూడా మీ వీసా రద్దవుతుందంటూ ప్రకటించింది. ఈ విషయాన్ని భారత్ లోని అమెరికా ఎంబసీ ప్రకటించింది. అమెరికాలో వీసా తీసుకుని చదువుకుంటుున్న విదేశీ విద్యార్ధులు క్లాసులు ఎగ్గొట్టడం, డ్రాప్ అవుట్లు...