భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించిన చంద్రబాబు
జయజయహి : “ఆపరేషన్ సింధూర్” తో పహల్గాం ఉగ్రదాడికి భారత్ ధీటైన బదులిచ్చింది. బుధవారం( మే 7, 2025 ) అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పి ఓ కె ) లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై లక్ష్యంగా దాడులు జరపగా.. సుమారు 30 మంది ఉగ్రవాదులు హతమయినట్టు సమాచారం అందుతోంది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి....