బాల్య వివాహాల నిర్మూలన సామాజిక బాధ్యతగా తీసుకోవాలి- డాక్టర్ కందుల నాగరాజు

జయజయహే : బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. 32 వ వార్డులో బాల్య వివాహాల నిర్మూలనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విషయంలో ముఖ్యంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహం వలన పిల్లలపై ఎటువంటి దుష్పరిణామాలు ఏర్పడతాయో విశదీకరించాలన్నారు. బాల్య వివాహం నిషేధ చట్టం...