Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీబాబా ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలి

బాబా ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలి

విశాఖ మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి

విశాఖపట్నం: జయజయహే : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు విశాఖ మాజీ నగర మేయర్ దంపతులు పేర్కొన్నారు. శుక్రవారం వారు విశాఖ తూర్పు నియోజకవర్గం లోని 11వ వార్డు బాలాజీ నగర్ లో కొలువై ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 17వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం సందర్భంగా బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర మాజీ మేయర్ దంపతులు మాట్లాడుతూ శ్రీ షిరిడి సాయిబాబా 17వ వార్షికోత్సవం లో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఆలయ కమిటీ మరియు ఆలయ అర్చకులు బాబా గుడి లోనికి సాదరంగా ఆహ్వానించి పూజలు నిర్వహించారని, బాబా ప్రజలు ఏమి కోరుకుంటే అది నెరవేర్చే దయాగుణం గల భగవంతుడిని, బాబా ఆశీస్సులు గ్రామ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం మూడువేల మంది భక్తులకు నగర మాజీ మేయర్ చేతుల మీదుగా అన్నా ఆరాధన చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?