బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం – భీమిలి ఎమ్మెల్యే గంటా

బాధ్యులపై చర్యలు తీసుకుంటాం _విశాఖపట్నం, జయజయహే : సింహాచలం కొండపై గోడ కూలి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఘటనా స్థలంలో.. అలాగే కేజీహెచ్ వద్ద బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. దుర్ఘటన జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ప్రతినిధులను, ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారన్నారు. సహాయ చర్యలు వేగవంతం చేశామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నామని వెల్లడించారు. గోడ ఇటీవల కాలంలో నిర్మించినదిగా...