SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 12:12 pm Posted by : SHIVASURYA NEWS

బడ్జెట్ హౌసింగ్ అపార్ట్మెంట్స్ – విఎంఆర్డిఎ ఛైర్మన్

జయజయహే : విశాఖనగర పరిసర ప్రాంత మధ్య తరగతి ప్రజల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు విశాఖ నగర పరిధిలో తాము బడ్జెట్ హౌసింగ్ అపార్ట్మెంట్లను నిర్మించ తల పెట్టామని విఎంఆర్డిఎ ఛైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్ తెలిపారు. నగర పరిధిలో సొంత ఇంటి కల నెరవేర్చు కోవడం కోసం మధ్య తరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము నగర పరిధిలో అపార్ట్మెంట్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నా మన్నారు. దీనికి సంబంధించి తమ వినియోగ దారుల ఆసక్తి, వారి ప్రాధాన్యతలు, అవసరాలను తెలుసు కునేందుకు సమగ్ర సర్వేను నిర్వహించ దలిచామన్నారు. ఈ విధంగా వారి నుంచి సేకరించిన సూచనలు, సలహాలను సమగ్రంగా పరిశీలించి వాటికి అనుగుణంగా తాము అవసరమైన ప్రణాళికలు వేసుకుంటామన్నారు. దీని కోసం ఒక నియమితమైన క్యూఆర్ కోడ్ తో కూడిన ప్రకటన బోర్డులను నగరంలో జన రద్దీ గల ప్రాంతాల్లో ప్రదర్శిస్తా మన్నారు. దీన్ని తమ వినియోగ దారులు స్కాన్ చేస్తే వారికి ఒక సర్వే అప్లికేషన్ వస్తుందని, దాన్ని వారు తమ అభిప్రాయాల మేరకు నింపి అప్ లోడ్ చెయ్యాలన్నారు. వాటి ఆధారంగా తాము, తమ సిబ్బంది ఒక అవగాహనకు వచ్చి ఎం ఐ జి బడ్జెట్ హౌసింగ్ అపార్ట్మెంట్స్ నిర్మాణానికి మంచి ప్రణాళికలు వేసుకుంటా మన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు వినియోగించు కోవాలన్నారు.