Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీప్రాణదాతకు, శతక రక్తదానమే ధ్యేయం

ప్రాణదాతకు, శతక రక్తదానమే ధ్యేయం

మదర్స్ లవ్ ఫౌండేషన్ సభ్యులు

శ్రీకాకుళం : జయజయహే : ఇప్పటి వరకు పదహారు ఎస్డీపీ (సింగల్ డోనర్ ప్లేట్ లెట్’), ముప్పై ఒక్క సార్లు రక్తదానం చేసిన అల్లాడ. నవీన్ ప్రాణదాతగా మారి, శతక రక్తదానమే ధ్యేయమని మదర్స్ లవ్ ఫౌండేషన్ సభ్యులు శుక్రవారం తెలిపారు. స్థానిక కిమ్స్ వైద్యశాలలో గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్స చేసుకున్న శ్యామల అనే మహిళకు ప్లేట్ లెట్స్ కౌంట్ ఒక్క సారిగా ఆరువేలు పడిపోవటంతో, మదర్స్ లవ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుప్రజ రౌత్ సంస్థ సభ్యులు అల్లాడ నవీన్, స్థానిక రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో, ఎస్డీపీ అందించి ప్రాణాలు కాపాడారు. మదర్స్ లవ్ ఫౌండేషన్ అధ్యక్షురాలు సుప్రజ రౌత్ మాట్లాడుతూ ప్రాణదాత నవీన్ రక్తదానంలో ఎప్పుడూ ముందుంటారని, అందరిలో స్ఫూర్తి నింపుతూ నగరంలో రక్త కొరత ఉన్న రక్తనిధికేంద్రానికి, రక్తదాతలను సమకూర్చుతారని, ఈ రోజు తలసేమియాదినం కావటంతో ఒక ప్రాణాన్ని కాపాడటం ఆనందదాయకమన్నారు. నగరంలో తలసేమియా పిల్లలకు ఎప్పుడు రక్తం అవసరం అనుకున్న మదర్స్ లవ్ ఫౌండేషన్ ముందుంటుందన్నారు. నిరంతరం ఏదో ఒక సేవలో నిమగ్నమౌతూ, ఒక ప్రక్క ప్రతి రోజు రాత్రి వేళలో, అన్నార్థులకు అన్నదానాలు నిర్వహిస్తున్నామని, పగటిపూట రక్తదానాలలో బాగామోతున్నామన్నారు. మాకు సహకారమందిస్తున్న ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమా శంకర్, సేవకులు, మదర్స్ లవ్ ఫౌండేషన్ సభ్యులు, లైన్స్ క్లబ్ మార్కెటింగ్ ఛైర్ పర్సన్ ఉర్లం శివతేజ పట్నాయక్ లకు ప్రత్యేక కృతజ్ఞతలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధి నంది. ఉమా శంకర్, దాత, మదర్స్ లవ్ ఫౌండేషన్ సభ్యులు అల్లాడ. నవీన్, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?