ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసి పార్టీ తరుపున ప్రజలకు అండగా ఉండండి – కె కె రాజు

విశాఖపట్నం జయ జయహే: వైసీపీ విశాఖ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త మరియు జిల్లా అధ్యక్షులు కె కె రాజు మంగళవారం సీతమ్మధారలో గల క్యాంపు కార్యాలయంలో ఉత్తర నియోజకవర్గం పరిధిలోగల వార్డు కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కార్పొరేషన్ మాజీ డైరెక్టర్లు, మరియు ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసి పార్టీ తరుపున ప్రజలకు అండగా ఉండాలని, అలాగే పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోడిప్యూటీ మేయర్...