Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని, మేయర్ , కలెక్టర్ కు పిర్యాదు చేసిన...

ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని, మేయర్ , కలెక్టర్ కు పిర్యాదు చేసిన 48వ వార్డు కార్పొరేటర్

జయజయహే : జీవీఎంసీ 48వ వార్డులో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలని 48వ వార్డు కార్పొరేటర్,జీవీఎంసీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గంకల కవిత అప్పారావు యాదవ్ విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇంచార్జ్ కమీషనర్ హరేంద్ర ప్రసాద్ కు, జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ కు పిజిఆర్ఎస్ లో సోమవారం పిర్యాదు అందజేశారు. వార్డులో వాటర్ ట్యాంక్ వద్ద అల్లరి మూకలు పలు అసాంఘిక కార్యక్రమాలు చేపడుతూ, ప్రజలకు సరఫరా అయ్యే మంచి నీటిని కలుషితం చేస్తున్నారని, స్మశాన వాటికలో రాత్రిపూట అల్లరి మూకలు, తాగుబోతులు,గంజాయి బ్యాచ్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, వార్డులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, రోడ్లపై వాహనాలు యొక్క బ్యాటరీలు, టైర్లను దొంగతనం చేస్తున్నారని వీటిపై తక్షణమే వార్డులో సీసీ కెమెరాలు అమర్చి, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలనీ, గస్తి పెంచాలని కోరారు. 48వ వార్డుకు పారిశుద్య సిబ్బంది సంఖ్య పెంచి, పారిశుద్య పనిముట్లను అధికంగా ఏర్పాటు చేయాలని వినతి అందజేశారు. ఈ విషయంపై అధికారులు సానుకూలంగా స్పందించారన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?