ప్రధాని మోదీని, భారత్ ను అంతం చేస్తా: మసూద్ అజహర్

జయజయహే : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలపై భీకర దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు భారత రక్షణశాఖ పేర్కొంది. అయితే భారత్ జరిపిన ఈ దాడుల్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ కుటుంబం హతం అయింది. మసూద్ కు చెందిన బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. మసూద్ ఫ్యామిలీలో మొత్తం 14...