SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 07 May 2025, 10:42 am Posted by : SHIVASURYA NEWS

ప్రధాని మోదీని, భారత్ ను అంతం చేస్తా: మసూద్ అజహర్

జయజయహే : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ దాడి చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్ లోని ఉగ్ర స్థావరాలు, మౌలిక సదుపాయాలపై భీకర దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో దాదాపు 80 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు భారత రక్షణశాఖ పేర్కొంది. అయితే భారత్ జరిపిన ఈ దాడుల్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ కుటుంబం హతం అయింది. మసూద్ కు చెందిన బహావల్ పూర్ స్థావరం పూర్తిగా నేలమట్టమైంది. మసూద్ ఫ్యామిలీలో మొత్తం 14 మంది హతం అయినట్లు ఆయనే వెల్లడించాడు. మరో నలుగురు ఆయన అనుచరులు కూడా మృతి చెందారు. అయితే ‘ఆపరేషన్ సిందూర్’ దాడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ ఖండించాడు. భారత్ పై విషం కక్కాడు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధం నియమాలను ఉల్లంఘించారని పేర్కొన్నాడు. ఈ ఘటనపై తనకు ఎలాంటి పశ్చాత్తాపం, నిరాశ లేదన్నాడు. భయం, విచారం కూడా లేదని తెలిపాడు. ఈ మేరకు ప్రధాని మోదీని, భారత్ ను నాశనం చేస్తానని మసూద్ అజహర్ హెచ్చరించాడు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రణాళిక వేస్తానని తెలిపాడు మసూద్. ఈ మేరకు ఓ లేఖను రిలీజ్ చేశాడు. ఇక బహావల్ పూర్ లో మసూద్ అజహర్ కుటుంబంపై జరిపిన దాడిలో ఆయన అక్క, బావ, కోడలు, మసూద్ భార్య, ఐదుగురు పిల్లలు, మరో నలుగురు అనుచరులు హతం అయ్యారు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా 9 ఉగ్రస్థావరాలపై భారత్ 24 మిస్సైల్స్ తో దాడికి పాల్పడింది. నిఘా వర్గాల అంచనా ప్రకారం 80 మంది ఉగ్రవాదులు హతం కాగా మరో 60 మంది తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ దాడులతో పాకిస్థాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.