ప్రధానితో త్రివిధ దళాధిపతులు
జయజయహే : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిత్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ త్రివిధ దళాల అధిపతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో వారంతా భేటీ అయ్యారు. అయితే గత వారం ముగ్గురు త్రివిధ దళాల అధిపతులతో వరుసగా మూడు రోజుల పాటు ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కానీ శుక్రవారం మాత్రం వీరంతా కలిసి ప్రధాని మోదీతో సమావేశం కావడం గమనార్హం. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సైతం హాజరయ్యారు. బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌తోపాటు...