Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీప్రధానితో త్రివిధ దళాధిపతులు

ప్రధానితో త్రివిధ దళాధిపతులు

జయజయహే : భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిత్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ త్రివిధ దళాల అధిపతలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసంలో వారంతా భేటీ అయ్యారు. అయితే గత వారం ముగ్గురు త్రివిధ దళాల అధిపతులతో వరుసగా మూడు రోజుల పాటు ప్రధాని మోదీ సమావేశమయ్యారు. కానీ శుక్రవారం మాత్రం వీరంతా కలిసి ప్రధాని మోదీతో సమావేశం కావడం గమనార్హం. ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ సైతం హాజరయ్యారు. బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌తోపాటు పాక్ అక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడులు నిర్వహించింది. ఈ దాడులకు ఆపరేషన్ సిందూర్ అని ప్రధాని మోదీ పేరు పెట్టారు. ఈ నేపథ్యంలో భారత్‌పై పాక్ ఎదురు దాడికి దిగింది. ఆ క్రమంలో భారత్, పాక్ సరిహద్దుల్లోని పంజాబ్, జమ్మూ కశ్మీర్‌లోని పలు ప్రాంతాలపై ద్రోనులు, క్షిపణులతో దాడికి దిగింది. వీటిని భారత్ తిప్పి కొట్టిన సంగతి తెలిసిందే

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?