SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 05 May 2025, 5:14 am Posted by : SHIVASURYA NEWS

ప్రతి చర్య తప్పదు

పాక్ పై రక్షణ మంత్రి రాజ్ నాథ్ ఆగ్రహం

జయజయహే : భారత్‌పై దాడికి తెగించిన వారికి గట్టి సమాధానం ఇచ్చే బాధ్యత దేశ రక్షణ శాఖ మంత్రిగా తనకుందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈనెల 22న తేదీన జమ్మూకశ్మీర్‌లో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు అత్యంక కిరాతకంగా మట్టుబెట్టిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి తాజా వ్యాఖ్యలు చేశారు. ఆదివారంనాడిక్కడ జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్కింగ్ స్టయిల్, దృఢ సంకల్పం అందరికీ తెలిసిందనేనని, మోదీ నాయకత్వంలో ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుందని పరోక్షంగా పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతిచర్యలను ప్రస్తావిస్తూ అన్నారు