భీమవరం : జయజయహే : భీమవరం ప్రతిభ విజ్ఞాన సమితి అధ్యక్షులుగా నియమితులైన కోట్ల ప్రసాద్ ను మార్నింగ్ కాఫీ క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. క్లబ్ కన్వీనర్ బొండా రాంబాబు, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కోట్ల నాని, పిఆర్వో భట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ పదవులు బాధ్యతలను మరింత పెంచుతాయని, ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా చిత్తశుద్దితో నిర్వర్తించాలని అన్నారు. ప్రసాద్ గతంలో కూడా ఎన్నో పదవులను చేసారని, రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని కోరుకుంటున్నామని అన్నారు. అనంతరం ప్రసాద్ ను సత్కరించారు. సంకా బాబు, సన్నిధి గుప్తా, కొప్పర్తి అప్పారావు, బొండా హనుమంతరావు, మానేపల్లి రవి చిన్నారావు, సకల కుమార్, కంచర్ల భాస్కరరావు గుప్త, కురిశెట్టి సతీష్, కొల్లేపర్ల సుబ్బారావు, కురిశెట్టిశ్రీనివాసఅప్పారావు, సభ్యులు పాల్గొన్నారు
ప్రతిభ విజ్ఞాన సమితి అధ్యక్షులు ప్రసాద్ ను సత్కరించిన మార్నింగ్ కాఫీ క్లబ్
0
56
Previous article
Next article
RELATED ARTICLES

