పోలీస్ థీమ్ యోగా.. పాల్గొన్న 5 వేల మంది పోలీసులు

రాష్ట్రంలో క‌నీసం రెండు కోట్ల మంది యోగాలో ప్ర‌వేశించేలా అవ‌గాహ‌న, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు చేపట్టామని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్‌ తెలిపారు. నిపుణులు రూపొందించిన 45 నిమిషాల స‌ర‌ళ‌మైన యోగా కామ‌న్ ప్రోటోకాల్ ప్ర‌కారం కార్య‌క్ర‌మాలు ఉంటాయన్నారు. యోగాంధ్ర మాసోత్స‌వాల సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌ బీఆర్‌టీఎస్ యోగా స్ట్రీట్‌లో పోలీస్ యోగాంధ్ర కార్య‌క్ర‌మం నిర్వహించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్‌ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తో క‌లిసి పాల్గొని యోగాస‌నాలు అభ్యసించారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. త‌నువు, మ‌న‌సును ఏకం చేసి శ‌రీరం...