పోలీసులు రౌడీ షీటర్లను కొడితే తప్పేంటి ? తెనాలి ఘటనపై హోంమంత్రి అనిత ..!
ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో తాజాగా పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడికి దిగడం, అనంతరం వారిని పట్టుకుని రోడ్డుపైనే పోలీసులు లాఠీలతో అరికాళ్లపై కొట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ చర్యను పోలీసు వర్గాలు ఇప్పటికే సమర్దించుకున్నాయి. పోలీసులపై గంజాయి బ్యాచ్ దాడి చేయడం వల్లే తాము వాళ్లను పట్టుకుని శిక్షించినట్లు చెప్పుకొస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్న తరుణంలో ఇవాళ హోంమంత్రి వంగలపూడి అనిత దీనిపై స్పందించారు. తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసుల బహిరంగ దాడిపై హోంమంత్రి అనిత స్పందించారు. పోలీసులు ఇలా రౌడీ షీటర్లపై...