SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 22 April 2025, 10:21 am Posted by : SHIVASURYA NEWS

పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణ ఆపాలి టెండర్స్ వాయిదా వేయడం కాదు, రద్దు చేయాలి

విశాఖపట్నం : జయజయహే : యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయిస్ యూనియన్, వి డి ఎల్ బి యూనియన్( సిఐటియు ) మరియు పెన్షనర్స్ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ ఆసుపత్రి వద్ద 204వ రోజున నిరసన కార్యక్రమం జరిగినది.

యూనియన్ కార్యదర్శి బి జగన్ మాట్లాడుతూ ఈరోజు ఓపెన్ చేయాలన్న టెండర్ మళ్లీ 28వ తేదీకి వాయిదా వేశారు ఇలా వాయిదాలు వేయడం కాదు పూర్తిగా హాస్పిటల్ ప్రైవేటు ఇవ్వాలని టెండర్స్ రద్దు చేయాలి. ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా ఉద్యోగుల హక్కులను, వారి కుటుంబాల ఆరోగ్య భద్రతను క్షీణింపజేసే దిశగా ఉందని విమర్శించారు.

“724.4 కోట్ల రూపాయల లాభాలను సొంతం చేసుకున్న విశాఖపట్నం పోర్ట్, 171 కోట్ల రూపాయల పన్నులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లిస్తున్నారు. అయినా పోర్ట్ హాస్పిటల్‌ను ప్రైవేటు వర్గాలకు అప్పగించడం సిగ్గుచేటు. ప్రజలకు సేవలు అందించాల్సిన ప్రభుత్వ హాస్పిటల్‌ను కేవలం లాభాల కోసం ప్రైవేటు వారికి ఇచ్చేయడం అన్యాయం. కార్మిక వర్గాల హక్కులను హరిస్తుంది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్మికుల సంక్షేమం, ఆరోగ్యాన్ని హరించడమే కాకుండా, ప్రజలకు మెరుగైన సేవలను అందించాల్సిన బాధ్యతను విస్మరించి, ప్రైవేటు సంస్థల ప్రయోజనాలను కాపాడడంలో మాత్రమే ఆసక్తి చూపుతుందనే విమర్శలు చేశారు. “ఇది కేవలం కార్మికులపై దాడి మాత్రమే కాకుండా, ప్రజా రంగ సంస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం. 40,000 కుటుంబాలు తమ ఆరోగ్యానికి సంబంధించిన సేవలకు దూరం అవుతాయి, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి,” అని ఆయన వ్యాఖ్యానించారు.

సి టి యు యూనియన్ ప్రభుత్వాన్ని తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, కార్మికులకు, ప్రజలకు హాస్పిటల్ సేవలను అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తోంది. ప్రైవేటీకరణ ద్వారా లాభం పొందేది ప్రైవేట్ సంస్థలే, ప్రజలు, కార్మికులు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు అని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలకు సిఐటియు నాయకులు కే సత్యనారాయణ జై సత్యనారాయణ బి లక్ష్మణరావు గణేశు సంకలు ఎల్లారావు రాఘవులు, నాయుడు కె ఎస్ కూమార్ తదితరులు పాల్గొన్నారు.