SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 6:31 am Posted by : SHIVASURYA NEWS

పేద విద్యార్థికి కంప్యూటర్ విరాళం

చోడవరం : జయజయహే : చోడవరం కేంద్రంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆధ్వర్యంలో సి డి వి ఎం ఫౌండేషన్ సద్భావ టీం ఆధ్వర్యంలో చోడవరం మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన పేద విద్యార్థి సాత్విక్ కు కంప్యూటర్ విరాళంగా అందజేశారు.ఈ కంప్యూటర్ విద్య స్వయం ఉపాధి మార్గంలో ముందుకు సాగేందుకు సహాయపడాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబం ఆర్థికంగా, ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని ఆశించారు. ఈ కార్యక్రమానికి సద్భావ సభ్యులు గీత లక్ష్మీ, ఆమె స్నేహితురాలు కీర్తి ప్రియ సహాయ సహకారాలను అందించారు.ఈ కార్యక్రమoలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కొప్పాక రాజేష్, సద్భావ టీం సభ్యులు గీత లక్ష్మీ , దేవర అప్పలరాజు , పసుమర్తి రాము తదితరులు పాల్గొన్నారు.