SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 7:54 am Posted by : SHIVASURYA NEWS

పెళ్లి ముందు విషాదం

జయజయహే : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన రామానాయుడు, హైదరాబాద్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల వివాహం నిశ్చయమయ్యింది . పెళ్లి ఏర్పాట్ల కోసం సెలవు తీసుకుని బుధవారం స్వగ్రామానికి బయలుదేరిన రామానాయుడు, అయిజ మండలం వెంకటాపురం వద్ద రోడ్డుప్రమాదానికి గురయ్యాడు. గాయాలపై చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున కన్నుమూశాడు. ఈ నెల 14న జరగాల్సిన పెళ్లి ముందు ఈ సంఘటన జరగడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.