పెరుగుతున్న గృహ వ్యయం
జయజయహే : జాతీయ శాంపిల్ సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌వో) విడుదల చేసిన కుటుంబ వినియోగ వ్యయ సర్వే నివేదిక లో పలు ఆసక్తికర అంశాలు వెలడయ్యాయి. చివరిసారిగా 2011-12లో ఈ నివేదిక విడుదలైంది కాగా 2017లో పూర్తిస్థాయి నివేదిక రూపొందించినప్పటికీ డాటాలో లోపాలున్నాయంటూ ఆ నివేదికను కేంద్రం విడుదల చేయలేదు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రెండున్నర లక్షల పైచిలుకు కుటుంబాలతో ఈ సర్వే జరిగింది.తాజా నివేదికలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2011-12 నుంచి 2022-23 మధ్యకాలంలో పట్టణ గృహ వినిమయ వ్యయం...