Friday, April 10, 2026
Homeఉద్యోగావకాశాలుపెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్ లో మెగా జాబ్ మేళా - ఎమ్మెల్యే పంచకర్ల

పెందుర్తి గవర్నమెంట్ హై స్కూల్ లో మెగా జాబ్ మేళా – ఎమ్మెల్యే పంచకర్ల

పెందుర్తి: జయ జయహే: జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ(స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) సహకారంతో ఈ నెల 09-05-2025 శుక్రవారం ఉదయం 9-00 గంటలకు పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జివిఎంసి 96 వ వార్డు పెందుర్తి కాలేజ్ గవర్నమెంట్ హైస్కూల్ ప్రాంగణం లో దాదాపు 40 పైగా కంపెనీలతో 2500 పైగా ఉద్యోగాలు కల్పించడం కొరకు మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది కావున పెందుర్తి నియోజకవర్గం నిరుద్యోగ యువతీ , యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు తెలియజేసారు ఈ మెగా జాబ్ మేళాలో బహుళ జాతీయ కంపెనీలు పాల్గొనచున్నారని వాటి ద్వారా నియోజవర్గం లో నిరుద్యోగ యువతి యువకులకు ఇంటర్వూలు నిర్వహించడం జరుగుచున్నది మెగా జాబ్ మేళా కు హాజరు అయ్యే నిరుద్యోగ యువతీ,యువకులు పదవ తరగతి/ఇంటర్/ఐ.టి.ఐ/ డిప్లొమా/బి. ఫార్మసీ /ఎం. ఫార్మసీ, నర్సింగ్ /డిగ్రీ /బి.టెక్/పి.జి, విద్యార్హతలు కలిగిన వారు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వారు

ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అభ్యర్థులు

ఖచ్చితంగా విద్యార్హత పత్రాలు జిరాక్స్,ఆధార్ కార్డ్,రెండు ఫోటోలతో హాజరుకావాలని సూచించడం జరిగినది

జాబ్ మేళా నిర్వహించు ప్రదేశం

పీఎం శ్రీ గవర్నమెంట్ హై స్కూల్ జూనియర్ కాలేజ్ దగ్గర పెందుర్తి విశాఖపట్నం

తేదీ మరియు సమయం

09.05.2025 తేదీన ఉదయం 9 గంటల నుండి

వివరముల కొరకు

8712655686,8790118349, 8790117279,8555868681,9966965502 ఫోన్ నెంబర్ల ద్వారా సంప్రదించాలని ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరములను https://naipunyam.ap.gov.in/user-registration లో నమోదు చేసుకోవలసింది గా పెందుర్తి ఎమ్మెల్యే కార్యాలయం నుండి తెలియచేసారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?