పాన్ ఇండియా జాతీయ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన నాగజ్యోతి
చోడవరం : జయజయహే : ఈనెల మూడు నాలుగు తేదీల్లో కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో పాన్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ పోటీల్లో నాగజ్యోతి నాలుగు బంగారు పథకాలను కైవసం చేసుకుంది. ఇప్పటికే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు పొందిన ఈమె తాజాగా మరో నాలుగు బంగారు పతకాలను సాధించి రాష్ట్రానికి పేరు తెచ్చింది. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటకు చెందిన కలగర్ల నాగజ్యోతి రోలుగుంట హై స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. చిన్ననాటి నుంచి కూడా...