పాకిస్థాన్‌కు పోస్టల్‌ సర్వీసులు నిలిపివేసిన భారత్

జయజయహే : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు భారత్‌ పాకిస్థాన్‌కు మరోసారి గట్టి షాక్‌ ఇచ్చింది. తాజాగా పాకిస్థాన్‌కు సంబంధించిన పోస్టల్‌ సర్వీసులను పూర్తిగా నిలిపివేసింది. దీంతో పాక్‌కు పార్సిల్స్‌, మెయిల్స్ పంపడంపై నిషేధం విధించింది. పాకిస్థాన్‌కు చెందిన వెబ్‌సైట్‌లను కూడా బ్యాన్ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్‌ పరిధిలోని తపాలా శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.