పహల్గాం ఉగ్రవాద దాడిపై స్పందించిన విశాఖ ఎంపీ శ్రీభరత్

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలపై ఇలా దాడి చేయడం అమానుషమని, ఈ విధమైన హింసను ఏ రూపంలోనూ అంగీకరించలేమని ఆయన అన్నారు. ఈ దాడిలో పాండురంగపురం, విశాఖపట్నంకు చెందిన శ్రీ జెఎస్ చంద్రమౌళి గారు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసి ఎంతో బాధ కలిగిందని ఎంపీ తెలిపారు. "ఈ సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ బాధను తట్టుకునే శక్తిని పొందాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా...