జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ తీవ్రంగా ఖండించారు. అమాయక ప్రజలపై ఇలా దాడి చేయడం అమానుషమని, ఈ విధమైన హింసను ఏ రూపంలోనూ అంగీకరించలేమని ఆయన అన్నారు.
ఈ దాడిలో పాండురంగపురం, విశాఖపట్నంకు చెందిన శ్రీ జెఎస్ చంద్రమౌళి గారు ప్రాణాలు కోల్పోయినట్టు తెలిసి ఎంతో బాధ కలిగిందని ఎంపీ తెలిపారు.
“ఈ సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ బాధను తట్టుకునే శక్తిని పొందాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన అన్నారు.
ఇటువంటి ఉగ్రవాద చర్యలకు సమాజంలో చోటు ఉండదని, దేశ భద్రత కోసం ప్రభుత్వం దృఢంగా స్పందించాలన్నారు.

