జయజయహే : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్ మధ్య ఓ ప్రత్యేకమైన బాండింగ్ ఉంది. అది మరోసారి కనిపించింది. అమరావతి రీ స్టార్ట్ సభా వేదికపై పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ చిన్న గిఫ్ట్ ఇచ్చారు. అదేమిటన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. పవన్ కల్యాణ్ సభా వేదికపై ప్రసంగించారు. ప్రధాని మోదీకి అర్థమయ్యేలా కొన్ని వాక్యాలను ఇంగ్లిష్ , హిందీలోనూ ప్రసంగించారు. పహల్గాం విషయంలో ప్రధాని మోదీకి అందరం అండగా ఉంటామని చెప్పారు. స్పీచ్ అయిపోయిన తర్వాత పవన్ కల్యాణ్ తన సీట్లో కూర్చునే సమయంలో.. మోదీ పిలిచారు. దగ్గరకు వచ్చిన పవన్‌కు తన చేతిలో ఉన్న చిన్న గిఫ్ట్ ను ఇచ్చారు.
పవన్ కు ప్రధాని చాక్లెట్ గిఫ్ట్
0
41
Previous article
Next article
RELATED ARTICLES

