పల్లె రాజకీయ పగలు – అభివృద్ధికి అడ్డుగోడలు

జయజయహే : రాజకీయ క్రీడలో, పార్టీల మాయలో తమ ఐకమత్యాన్ని, అస్థిత్వాన్ని కోల్పోతున్న కొన్ని పల్లెలు .పల్లెల్లో పెరుగుతున్న పగలు, ప్రతీకారాలు అభివృద్ధికి ఆటంకాలు . ఒకప్పుడు పల్లె జీవితం అనేది ఎంతో అందంగా, ఆనందంగా పరస్పర సహకారంతో, స్నేహబంధాలకు నిలయంగా వుండేది. గడిచిన తరాల్లో గ్రామాల్లో ప్రజలు భేదాభిప్రాయాలకంటే బంధాలకు, స్నేహాలకు ఎక్కువగా విలువ ఇచ్చేవారు. కానీ రాను రాను కొన్ని పల్లెల్లో రాజకీయ పార్టీల జోక్యం ఎక్కువై వారి స్వార్ధం కోసం పల్లె ప్రజలను కులాలుగా, వర్గాలుగా విడగొట్టి వారిలో వారికే...