Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీపల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి

పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఐదుగురి మృతి

వినుకొండ: జయజయహే : పల్నాడు జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వినుకొండ మండలం శివాపురం వద్ద బొప్పాయి కాయల లోడ్ తో వెళ్తున్న బొలెరో ట్రాలీని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారు. మృతులంతా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను సమీపఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?