పరువు హత్యాలా? అహంకారపు అకృత్యాలా? తెలుగు రాష్ట్రాల్లో నానాటికి పెరిగిపోతున్న దురహంకారం హత్యలు
కన్న ప్రేమను కాటికి పంపుతున్న కసాయి తల్లిదండ్రులు క్షీణికవేశములో ప్రాణాలు తీస్తున్న కుల,మతోన్మాదులు విచక్షణ మరిచిన రాక్షసులుగా మారుతున్న రక్త సంబంధీకులు.. వేరే కులం, వేరే మతం వారిని ప్రేమించారన్న కారణంతో…కొన్ని చోట్ల కూతుర్ని, మరికొన్ని చోట్ల ఆమె ప్రేమించినవాడిని బలితీసుకుంటున్న అమానుష దృశ్యాలు మన చుట్టూ నిత్య కృత్యంలా మారాయి,చిన్నతనం నుంచి ఎంతో అల్లారు ముద్దగా పెంచిన తమ పిల్లలని ఎదిగిన తరువాత తన ఇష్టానుసారం నచ్చిన వాడిన ప్రేమించి పెళ్లి చూసుకోవడం నేరంగా చూస్తున్న కొంత మంది తల్లిదండ్రులు పరువు అనే...