SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 01 May 2025, 9:17 am Posted by : SHIVASURYA NEWS

పది రోజుల క్రితం మరణించిన బాలిక.. పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్

జయజయహే : రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ప్రభుత్వ హై స్కూల్లో చదువుతుంది . ఏప్రిల్ 17న అనారోగ్యంతో నాగచైతన్య మరణించింది, బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 510 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్ గా నిలిచింది .ఈ విషయం తెలుసుకుని బాలిక తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు….