Sunday, April 12, 2026
Homeశివ సూర్య డైలీపందూరులో బ్రిడ్జి శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత

పందూరులో బ్రిడ్జి శంకుస్థాపన చేసిన హోం మంత్రి అనిత

అనకాపల్లి : జయజయహే : అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. కోటఉరట్ల మండలం రామచంద్రపురం గ్రామంలో దుర్గా గాయిత్రి దేవి అమ్మవారిని హోం మంత్రి అనిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోం మంత్రికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.తరువాత, పందూరు గ్రామంలో రూ.5.75 కోట్ల నిధులతో నిర్మించనున్న బ్రిడ్జికి శంకుస్థాపన చేశారు. గత కొన్నేళ్లుగా బ్రిడ్జి లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న పందూరు, పాత గొట్టివాడ, ములగలలోవ గ్రామాల ప్రజలకు ఇది ఎంతో ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా మూడు గ్రామాల ప్రజలు హోం మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

                               

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?