Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీనేరేడు బంద గ్రామంలో వైద్య పరీక్షలు

నేరేడు బంద గ్రామంలో వైద్య పరీక్షలు

రావికమతం : జయజయహే : అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు పంచాయతీ నేరేడు బంధ గిరిజన గ్రామానికి ఎట్టకేలకు వైద్య బృందం చేరుకుంది.ఆ గ్రామంలో గిరిజనులు జ్వరాలతో అల్లాడిపోతున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలపై జిల్లా మలేరియా ఆఫీసర్ ఆధ్వర్యంలో కొత్తకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది హెచ్ఎస్ రమణ ,ఎల్ టి మహేష్ , సబ్ యూనిట్ ఆఫీసర్ ఎస్ వి రమణ సందర్శించి ఆ ఊరిలో ఐఆర్ఎస్ స్ప్రేయింగ్ నిర్వహించారనీ గిరిజనులు మంగళవారం తెలిపారు. ఆ గ్రామంలో గల ప్రజలు అందరకు ఆర్డిటి కిట్లతో రక్తపరీక్షలు చేసి మందులను ఉచితంగా అందజేశారు. మలేరియా రాకుండా దోమతెరలు వాడాలని నీటి నిలువలు లేకుండా ఉంచాలని కాచి వడపోసిన నీరును తాగాలని పరిసారాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గిరిజనులకు సూచించారు. అలాగే ఆర్డిటి పరీక్షలు కూడా నిర్వహించగా ఆరుగురికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించి మందులు అందజేశారు. అయితే పత్రికల్లో వస్తేనే మా ఊరు మా గ్రామం రేపు చూస్తున్నారు అంటూ గిరిజనులు వాపోతున్నారు. ఇక నుంచి అయినా సరే ఎప్పటికప్పుడు వైద్య బృందం తమ గ్రామాలను సందర్శించి ఆరోగ్య పరిస్థితులు చక్కదిద్దాలని గిరిజనులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?