నేడు సివిల్ మాక్ డ్రిల్ లు
విశాఖ, హైదారాబాద్ లో నిర్వహణ ఉగ్రదాడులపై అప్రమత్తత కోసమే జయజయహే : సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితులు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేయడానికి రెడీ అవుతున్న సమయంలో.. దేశ ప్రజలందరిలో యుద్ధ సన్నద్ధత ఉండేలా చూసేందుకు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఈ సివిల్ మాక్ డ్రిల్ ఏర్పాట్లపై కేంద్ర హోం కార్యదర్శి గోవింద్ మోహన్ మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులతో కీలకమైన సమావేశాన్ని నిర్వహించారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు...