SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 19 April 2025, 11:44 am Posted by : SHIVASURYA NEWS

నేడు మక్కువలో ఐదు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు

విజయనగరం శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో..

వైద్య సేవలను రోగులు సద్వినియోగం చేసుకోవాలి

డాక్టర్ అక్కాన శ్రీరామ్మూర్తి పిలుపు…

మక్కువ , జయజయహే :-విజయనగరంలో గల శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నేడు మక్కువ మండలంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు డాక్టర్ అక్కాన శ్రీరామమూర్తి తెలిపారు. గ్రామీణ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న సంకల్పంతో ఆదివారము నాడు పార్వతీపురం మన్యం జిల్లా , మక్కువ మండలంలో మక్కువ ,శంబర , కాశీపట్నం , కవిరిపల్లి , మార్కుండ పుట్టి గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ మేరకు కంటి వైద్యనిపుణులకే కంటి పరీక్షలు , ఆర్తో వైద్యనుపులచే కీళ్ల నొప్పులు , నడుము నొప్పులు, వాత నొప్పులు , ఎముకల నొప్పులు నిర్వహించనున్నామని తెలిపారు. అలాగే జనరల్ వైద్యులచే జ్వరము , దగ్గు , జలుబు , షుగర్ , బిపి వ్యాధి పరీక్షలు నిర్వహిస్తుమని ఆయన తెలిపారు. రోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపారు. మక్కువలో డాక్టర్ పి మల్లేశ్వరరావు ఆసుపత్రిలో , కాశీపట్నం లో గ్రామ సచివాలయం వద్ద , శంబర , మార్కుండపుట్టి , కవిరిపల్లి గ్రామాల్లో ఆయా రామ మందిరాల ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత వైద్య పరీక్షలు చేపట్టినట్టు తెలిపారు. ఆపరేషన్ పడే రోగులకు విజయనగరంలో గల శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యందు నామమాత్రపు ఖర్చుతో ఆపరేషన్ నిర్వహించబడనని , ఈ నేపథ్యంలో ఉచిత వైద్య సేవలను రోగుల సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ అక్కాన శ్రీరామ్మూర్తి తెలిపారు.