నేడు తెలుగు జాతికి పండుగ రోజు.. మహానాడులో ఏపీ సీఎం
టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహంపై పూలుజల్లి నివాళులర్పించారు. తెలుగుజాతి ఆరాధించే మహానేత ఎన్టీఆర్ అని సీఎం కొనియాడారు.టీడీపీ మహానాడు రెండవ రోజు ప్రారంభమైంది. స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , ముఖ్యనేతలు నివాళులర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. మహానాడు తొలిరోజు కీలక అంశాలపై చర్చించుకున్నామన్నారు. పార్టీ బలోపేతం, ప్రజలకు మేలు చేసేలా చర్చలు జరిగాయన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు, తెలుగు తేజం, తెలుగు...