నేటి నుండి బద్రీనాథుని దర్శనం ఆరంభం

దేవభూమిగా భాసిల్లుతున్న ఉత్తరాఖండ్‌లో వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఒకటి- బద్రీనాథ్. దేశం నలుమూలల నుంచి ఏటా లక్షలాదిమంది దర్శించుకుంటుంటారు. బద్రీనాథ్‌తో కలిపి చార్ ధామ్ యాత్రల్లో పాల్గొంటుంటారు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరచుకున్నాయి. ఈ తెల్లవారు జామున సరిగ్గా 6 గంటలకు వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు ఆలయం తలుపులను తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బద్రీనాథుడికి తొలి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి 10 వేల మందికి పైగా...