నేటి నుండి నీడ మాయం

రాజమహేంద్రవరం: జయజయహే : ఖగోళ అద్భుతం వల్ల సోమవారం నుంచి ఈ నెల 14వరకు మిట్ట మధ్యాహ్నం మనిషి నీడ రెండు నిమిషాల పాటు మాయమవుతుందని ఇంటర్నేషనల్‌ ఆస్టరాయిడ్స్‌ సర్చ్‌ క్యాంపెయిన్‌ (ఐఏఎస్‌సీ) జాతీయ కన్వీనర్‌ మేకా సుసత్యరేఖ ఆదివారం తెలిపారు. ఈ పరిణామాన్ని జీరో షాడోగా వ్యవహరిస్తారని అన్నారు. సాధారణంగా నీడ మనిషికి ఏదో ఒకపక్క కనిపిస్తుందని, సోమవారం నుంచి 14 వరకు మాత్రం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి మన మీద లంబంగా పడి నీడ మాయమవుతుందని ఆమె వివరించారు. ‘‘భూమి...