నింగిలో మన గూఢచారి…జూన్‌లో ఈవోఎస్-09 ఉపగ్రహ ప్రయోగం
భారత్-పాక్ సరిహద్దుపై 24 గంటలూ నిఘా సూళ్లూరుపేట: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దుపై నిఘా పెంచాలని భారత్ భావిస్తోంది. దీనికోసం పగలూ, రాత్రీ తేడా లేకుండా 24 గంటలూ.. నిఘా పెట్టే ఓ గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. దీనికోసం జూన్‌లో అత్యాధునిక ఈవోఎస్-09 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ-సీ61 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనుంది. సీ-బ్యాండ్ సింథటిక్స్ ఎవర్చర్ రాడార్‌ను అమర్చిన ఈవోఎస్-09 ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా అధిక రిజల్యూషన్‌తో కూడిన...