Monday, April 13, 2026
Homeశివ సూర్య డైలీనవ వదువుకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు అందించిన డాక్టర్ కందుల

నవ వదువుకు బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు అందించిన డాక్టర్ కందుల

జయజయహే : విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు నిర్విరామ సేవా కార్యక్రమాలలో భాగంగా నవ వధువు ధరణికి బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాగుణంతో ముందుకు వెళ్లాలని అభిలాషించారు.సేవే దైవమని చెప్పారు.గత నాలుగు దశాబ్దాలు నుంచి తాను నిర్విరామంగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. అవసరమైన వారికి అర్హులైన వారికి తగిన సాయం చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. నిరుపేద మహిళలకు, వృద్ధులకు, వితంతువులకు, విభిన్న ప్రతిభావంతులకు, పేద విద్యార్థులకు, ఒంటరి మహిళలకు ఇలా అందరికీ తన పరిధి మేరకు సహాయం చేస్తూ వస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో కూడా వారికి తన సేవలు కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొమ్మాది వైయస్సార్ కాలనీకి చెందిన అరుణ , లక్ష్మీనారాయణ , రమాకామేశ్వరి , గుణవతి , రమేష్ , అలాగే కందుల కృష్ణ , నలినీ దేవి, కేదార్నాథ్, బద్రీనాథ్, శ్రీను , వరద శ్రీను, అప్పారావు ,బుజ్జి ,జానకీ, శ్రీదేవి , రావణమ్మ ,కుమారి, తదితరులు పాల్గొన్నారు.

                                   

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?