నక్కపల్లిలో ‘మినీ హాకీ గ్రౌండ్‌ను’ ప్రారంభించిన హోం మంత్రి అనిత

యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నా.. అనకాపల్లి జిల్లా,జయజయహే : నక్కపల్లి ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హాకీ మినిగ్రౌండ్‌ను హోం మంత్రి వంగలపూడి అనిత మంగళవారం ప్రారంభించారు. ఆస్ట్రోటర్ఫ్‌తో రూ.1.6 కోట్ల వ్యయంతో మైదానం నిర్మించబడింది. ఈ సందర్భంగా మంత్రి అనిత, హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మైదానంలో క్రీడాకారులతో కలిసి హాకీ ఆడారు. మంత్రి అనిత మాట్లాడుతూ, హాకీ గ్రౌండ్‌లో వాటర్, కరెంట్ సమస్యలను తక్షణమే పరిష్కరించామన్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసిన కోచ్‌లకు ధన్యవాదాలు...