నందవరంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.

నందవరం,శివసూర్య,డిసెంబర్ 25: నందవరం మండలంలో క్రైస్తవులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన నందవరంఎస్సీ కాలనీలో క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉపాధి నిమిత్తం సంవత్సరమంతా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్న కాలనీవాసులు క్రిస్మస్ పండుగ సందర్భంగా స్వగ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్  పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళలు, యువకులు, చిన్నారులు రంగురంగుల విద్యుత్ కాంతులతో ముస్తాబు చేసి చర్చిలో సాయంత్రం పెద్ద సంఖ్యలో యువత పాల్గొని క్రిస్మస్ భక్తిగీతాలు ఆలపిస్తూ...