దేశంలో యుద్ధ వాతావరణం.. క్యాటగిరీ 2లో విశాఖ, హైదరాబాద్

జయజయహే : భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను విడుదల చేసింది. యుద్ద ప్రభావం ఉండే ప్రాంతాలను మూడు క్యాటగిరీలుగా విభజించింది. ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం క్యాటగిరీ 1లో ఉన్నాయి. విశాఖపట్నం, హైదరాబాద్‌లు క్యాటగిరీ 2లో ఉన్నాయి. కేంద్ర జాబితా ప్రకారం ఏఏ ప్రాంతాలు ఏ క్యాటగిరీలో...