SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 6:09 am Posted by : SHIVASURYA NEWS

దేనికైనా సిద్ధం కావాలి

పరిస్థితులను ప్రజలకు వివరించాలి

యుద్ధ సన్నద్ధతపై సీఎం సమీక్ష

జయజయహే : ఆపరేషన్ సిందూర్ అనంతర పరిణామాలు, సివిల్ డిఫెన్స్ కార్యాచరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు రాజధాని అమరావతిలో సమీక్ష నిర్వహించారు. నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ సమావేశంలో పాల్గొన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, వైద్య ఆరోగ్య, పర్యాటక, దేవదాయ, రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. ఇక, ఆన్ లైన్ విధానంలో రివ్యూకు హాజరయ్యారు ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రైల్వే, ఇండియన్ ఆర్మీ, నావీ, ఎయిర్ పోర్స్, సిఐఎస్ఎఫ్ అధికారులు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, సన్నద్దతపై చర్చించారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ, పరిస్థితులపై ప్రజలకు అవగాహణ కల్పించడం పై ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఊహించని ఘటనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపారు.