దేనికి భయపడం- యుద్దానికి సిద్ధం –భారత ఆర్మీ
భారత ఆర్మీ పోస్ట్ ప్రకారం.. ” దేనికీ భయపడం, ఏదీ మిమ్మల్ని ఆపలేదు, ఏ భూభాగం మాకు దూరం కాదు, క్లిష్టమైనది కాదు, ఎప్పుడూ యుద్ధానికి సిద్ధమే’ అని పేర్కొంది. ఇప్పటికే యుద్ధానికి తాము సిద్ధం అంటూ నేవీ అధికారులు కూడా పోస్ట్ పెట్టారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇక అంతకుముందే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని...