SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 26 April 2025, 12:10 pm Posted by : SHIVASURYA NEWS

దేనికి భయపడం- యుద్దానికి సిద్ధం –భారత ఆర్మీ

భారత ఆర్మీ పోస్ట్ ప్రకారం.. ” దేనికీ భయపడం, ఏదీ మిమ్మల్ని ఆపలేదు, ఏ భూభాగం మాకు దూరం కాదు, క్లిష్టమైనది కాదు, ఎప్పుడూ యుద్ధానికి సిద్ధమే’ అని పేర్కొంది. ఇప్పటికే యుద్ధానికి తాము సిద్ధం అంటూ నేవీ అధికారులు కూడా పోస్ట్ పెట్టారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నావికాదళం సిద్ధంగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఇక అంతకుముందే పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడిపై ఆయన స్పందించారు. ఏం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. ఉగ్రదాడిపై దర్యాప్తునకు తాము సిద్ధమేనని అన్నారు. ఎలాంటి ముప్పు వచ్చినా ఎదర్కొంటామని తెలిపారు. మరోవైపు శాంతికే తమ ప్రాధాన్యం అని తెలిపారు. పాక్ ప్రధాని మాటలతో భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యాయి. మరోవైపు విశాఖపట్నంలోని నేవీ సన్‌రైజ్‌ ఫ్లీట్‌కు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. తూర్పు నావికాదళాధిపతి వైస్ అడ్మిరల్ ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సముద్రమార్గంలో పెరుగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.