Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీదెబ్బ మీద దెబ్బ

దెబ్బ మీద దెబ్బ

నిన్న ఎమ్మెల్సీ రిజైన్

తాజాగా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా

జయజయహే : వైసీపీ అధినేత జగన్ కు సొంత జిల్లా కడపలో వరుస షాకులు తగులుతున్నాయి. నిన్న రాయచోటి నియోజకవర్గానికి చెందిన శాసన మండలి డిప్యూటీ ఛైర్‌ పర్సన్‌ మయానా జకియా ఖనమ్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ కు ఆయన లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు నెలలుగా అధినేత జగన్ ను కలవడానికి తాను ప్రయత్నిస్తున్నానన్నారు. కానీ స్థానిక మాజీ ఎమ్మెల్యే సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్ర గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగన్ నిర్వహించిన మీటింగ్ కు సైతం హాజరుకాలేదు. జనసేన లేదా టీడీపీలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు కడప జిల్లాలో ప్రచారం సాగుతోంది. దీంతో కూటమి ఖాతాలో మరో మున్సిపల్ చైర్మన్ పదవి చేరనుంది. ఇదిలా ఉంటే.. వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్‌ బాబుకు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. పదవి నుంచి తొలగిస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ నిన్న జీవో విడుదల చేశారు. సురేష్ బాబు తన కుటుంబానికి చెందిన ఎంఎస్ వర్ధిని కనస్ట్రక్షన్ సంస్థ ద్వారా కడప నగరంలో వివిధ అభివృద్ధి పనులను చేయించినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో పురపాలక చట్టం నిబంధనలు పాటించనందుకు ఆయనపై వేటు వేశారు. దీంతో వైసీపీ ఖాతాలో నుంచి మరో మేయర్ పదవి చేజారి పోయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?