SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 10:39 am Posted by : SHIVASURYA NEWS

దక్షిణ నియోజకవర్గం వార్డుల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ పర్యటన

ఎమ్మెల్యే వంశీకృష్ణ తో ప్రభుత్వ శాఖ అధికారులు

జయజయహే : విశాఖపట్నం జయ జయహే 35 వ వార్డు వెలంపేట పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలో గత కొన్ని దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇళ్ల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. శనివారం వార్డులోని వెలంపేట పర్యటన లో ఎమ్మెల్యే అక్కడ నివాసస్థులతో మాట్లాడారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా ఇదే ప్రదేశంలో నివాసం ఉంటున్నామని అయితే ఇక్కడ ఇల్లు నిర్మిస్తామని చెప్పిన పాలకులు జీవీఎంసీ అధికారులు.. ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఎమ్మెల్యే ముందు వాపోయారు. దీంతో ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో అక్కడే మాట్లాడారు. ఎన్ని కుటుంబాలు నివాసం ఉంటున్నాయో ఆరా తీసిన ఆయన అందరికీ లబ్ధి చేకూరేలా ఇల్లు నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులు సూచించారు. త్వరలో ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు వంశీకృష్ణ శ్రీనివాస్ స్థానిక ప్రజలకు తెలియచేసారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కు ప్రశంసల జల్లు కురిపించారు. అనంతరం 42 వార్డులో ఇంద్రానగర్ కాలనీలో స్థానిక ప్రజలతో మాట్లాడి త్వరలో నిర్మించబోయే ఇళ్ల నిర్మాణంపై అక్కడ నివాసితులతో చర్చించారు.ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజలందరూ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వేరొక చోట నివాసానికి ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. చివరిగా 27 వార్డులో వీటి కాలేజీ ఉన్న ప్రాంతంలో అధికారులు , జీవీఎంసీ సిబ్బందితో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు .ఈ సందర్భంగా త్వరలో నిర్మించి బోయే గృహ నిర్మాణం పై స్థానిక కార్పొరేటర్, ప్రజలు, నాయకులతో చర్చించారు. కార్యక్రమంలో జోన్ 4 కమిషనర్ మల్లయ్య నాయుడు, జోన్ 5 కమిషనర్ రాము , జోన్ 3 జోనల్ కమిషనర్ శివప్రసాద్ , స్థానిక వార్డ్ కార్పొరేటర్ లు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ , హౌసింగ్ ఏఈ లు, జీవీఎంసీ పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.