SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 25 April 2025, 6:43 am Posted by : SHIVASURYA NEWS

థాంక్యూ.. జగన్ సార్

నాకు ఈ హోదా ఇచ్చింది మీరే

మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతా

సస్పెన్షన్ పై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ స్పందన

జయజయహే : వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు దువ్వాడపై ఫిర్యాదులు రావడంతోనే ఈ చర్య తీసుకున్నారు. తాజాగా తన సస్పెండ్‌పై దువ్వాడ శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నాకు ఈ స్థాయిని, హోదాను, ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ కోసం నేను ఎంతో కష్టపడి పనిచేశాను. గోంతెత్తి మాట్లాడాను. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసిన నన్ను అకారణంగా.. వ్యక్తి గత కారణాలు అనే కారణంతో నన్ను సస్పెండ్ చేశారని తెలిసింది. ఇందుకు నేను పార్టీ నాకు అందించిన సహకారం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో అడుగులు వేసిన నేను.. జగన్మోహన్‌ రెడ్డితో నడుస్తున్న నేను.. నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ చిరస్మరణీయం. భూకబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిషలు పనిచేశాను. ఇక ఈ జరిగిన పరిణామాల్ని నేను స్వీకరిస్తున్నాను. ఇకనుంచి మరింత కష్టపడి పనిచేస్తాను. ఇంటింటికీ తిరుగుతాను. ప్రజలతో మమేకమైపోతాను. ఇంతవరకు గౌరవాన్ని అందించిన ప్రజలకు పాదాభివందనాలు. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రజల సేవలో నిమగ్నమై ఉంటాను.’’ అంటూ చెప్పుకొచ్చారు.